ఈటిసి సీనియర్ ఫ్యాకల్టీకి ఘన సత్కారం

UPDATED 1st AUGUST 2018 WEDNESDAY 10:00 PM

సామర్లకోట: సామర్లకోట ఈటీసీలో సీనియర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న షేక్ ఖాజా మోహిద్దీన్ ను రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ రంజిత్ భాషా విజయవాడలో బుధవారం ఘనంగా అవార్డుతో సత్కరించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఐదు జిల్లాలకు చెందిన నాలుగు వందల మంది అభ్యర్థులకు సుమారు ఏడాదిన్నర పాటు ఎనిమిది బ్యాచ్ లకు బి.ఎఫ్.టి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్నఅభ్యర్థులకు పరీక్షలు నిర్వహించగా కేవలం ఒక్కరు మాత్రమే పాస్ కాలేదని, రాష్ట్రంలో ఉన్న మూడు ఈటీసీలలో సామర్లకోట ఈటిసిని ఉత్తమ ఈటీసీగా ఎంపిక చేసి ఆయనకు ఈ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా అవార్డు పొందిన మోహిద్దీన్ ను స్థానిక ఈటిసి సిబ్బంది అభినందించారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us