UPDATED 27th JUNE 2019 THURSDAY 7:00 PM
పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలో భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న మరిడమ్మ అమ్మవారి దేవాలయ క్షేత్రంలో జేష్ఠ బహుళ దశమి తిథిని పురస్కరించుకుని గురువారం ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి ఆధ్యర్యంలో ఆలయ వేద పండితులు చిట్టెం హరిగోపాలశర్మ నేతృత్వంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా ఆయుష్యహోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ డాక్టర్ చింతపల్లి బ్రహ్మాజీ, వేద పండితులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







