UPDATED 27th SEPTEMBER 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏపీ సీఎం కప్ అండర్-19 బాలుర, బాలికల ఖో-ఖో, త్రో బాల్ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో కాకినాడ ఐడియల్ జూనియర్ కళాశాల మొదటి స్థానంలో నిలవగా, సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడాకారులు ద్వితీయస్థానంలో నిలిచారు. అలాగే జిల్లా స్థాయి ఎంపిక పోటీలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సిహెచ్ లీలాశ్రీదేవి, వై. తాతబ్బాయి, జె. రఘురాం, వి. సీతాపతి, పి. రత్నశ్యాముల్, టీవీమధు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.







