ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తా

UPDATED 1st APRIL 2019 MONDAY 9:00 PM

సామర్లకోట: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసి వారి సంక్షేమంలో భాగస్వామిని అవుతానని జై భారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, పెద్దాపురం నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థి డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జై భారత్ నేషనల్ పార్టీతోనే అన్నివర్గాల వారికి న్యాయం జరుగుతుందని అన్నారు. దేశాన్ని సంఘటితంగా ఉంచే శక్తి కేవలం తమ పార్టీకే ఉందని, ఈ ఎన్నికలలో తమ పార్టీ గుర్తు గాజులుపై ఓటువేసి తనకు గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కె. అబ్బాస్, సత్యశ్రీ, అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.   

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us