వాషింగ్టన్ (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022 : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మిసిసిపీలో దుండగులు కాల్పులకు తెగబడటంతో ముగ్గురు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మిసిసిపీ గల్ఫ్‌పోర్ట్‌లో నూతన సంవత్సర వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగులు ఒక్కసారిగా పౌరులపై కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.
Telugu News,America,Firing,International News







