UPDATED 21st JUNE 2018 THURSDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో సూరంపాలెం గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో 60 మంది గ్రామస్థులకు కంటి పరీక్షలు నిర్వహించి, అనంతరం 16 మందిని ఆపరేషన్ నిమిత్తం కాకినాడ తరలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజాబాబు, డాక్టర్ అంజు, కిరణ్ ఆసుపత్రి టెక్నిషియన్స్ సత్య, సుధ, జయ, జానీ, పిఆర్వో సురేష్, కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం సిబ్బంది పి. రాజశేఖర ఫణింద్ర, బి. సుధీర్, విద్యా వాలంటీర్లు శశాంక్, రఘురాం, ప్రమోద్, శ్యామ్యూల్, సరయు, మీను, అంజుమ్ ఫాతిమా, తదితరులు పాల్గొన్నారు.







