UPDATED 24th JULY 2019 WEDNESDAY 10:00 PM
సామర్లకోట: రాష్ట్రంలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం, నూజివీడు ట్రిపుల్ ఐటి కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశానికి పది మంది విద్యార్థులు ఎంపికైనట్లు ఎంఈవో వైవి శివరామకృష్ణయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామర్లకోట పట్టణానికి చెందిన మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఆశాజ్యోతి నూజివీడు ట్రిపుల్ ఐటీకి, పరాస్ కుమారి శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారని అన్నారు. అలాగే మండల పరిధిలో గల ఉండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి డి. సత్యవేణి, జె. బాలామణి శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి, రూబీ పెర్సిస్, ఆర్. సారిక, పి. లలితాదేవి ఒంగోలు ట్రిపుల్ ఐటీకి, చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి సాదా శ్రావణి, కొత్త సువర్ణ, వేట్లపాలెం ఉన్నత పాఠశాల నుంచి ఎంవి దుర్గాదేవి, ఎం. లక్ష్మీరాజేష్ ఎంపికైనట్లు ఎంఈవో తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తదితరులు అభినందించారు.







