ఆదిత్య ప్రొఫెసరుకు డాక్టరేట్

UPDATED 13th OCTOBER 2018 SATURDAY 6:30 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఫ్రొఫెసర్ ఎం. అంజిబాబు కాకినాడ జెఎన్టీయుకె నుంచి డాక్టరేట్ పొందినట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ అంజిబాబు సమర్పించిన Free Vibration Analysis of Rectangular and Elliptical with Cutouts అనే థీసిస్ కు డాక్టరేట్ లభించిందని తెలిపారు. జెఎన్టీయుకె ప్రొఫెసర్స్ డాక్టర్ ఎన్. మోహనరావు, డాక్టర్ వి.వి. సుబ్బారావుల పర్యవేక్షణలో ఈ పి.హెచ్.డి పూర్తి చేసినట్లు డాక్టర్  అంజిబాబు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అంజిబాబును ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్  టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, తదితరులు అభినందించారు. 
  

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us