UPDATED 5th APRIL 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక స్టేషన్ సెంటర్ లో వేంచేసిఉన్న నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో గురువారం లక్ష మల్లెపూలతో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. కొత్త అమావాస్యను పురస్కరించుకొని ప్రతిరోజు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా లక్ష మల్లెపూలతో పూజలు నిర్వహించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మద్దుకూరి జోగారావు, ఆలయ కమిటీ ధర్మకర్త వల్లూరి పుల్లయ్య, యార్లగడ్డ అక్కిరాజు, యార్లగడ శ్రీను, త్రినాథరావు, గోలి రాంబాబు, దేవళ్ల సాయి కుమార్, పెనుమర్తి సత్యనారాయణ, నీతి చక్రధరరావు, అప్పల వెంకట పవన్ శర్మ, సత్తి అరుణ, చలికి తులసమ్మ, మద్దాల గీత, రాజీ, తదితరులు పాల్గొన్నారు.







