దేవీ నమోస్తుతే

* ఒక్కోరోజు ఒక్కో అలంకరణ 
* ఘనంగా ప్రారంభమైన దసరా నవరాత్రి ఉత్సవాలు

UPDATED 29th SEPTEMBER 2019 SUNDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్) : సామర్లకోట పట్టణ, మండల పరిధిలోని గ్రామంలో గల ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమైయ్యాయి. సామర్లకోట పట్టణంలో బడెలమ్మ చెరువు వద్ద ఉన్న నవదుర్గ ఆలయం, ప్రసిద్ధ పంచారామ క్షేత్రం భీమేశ్వరస్వామి ఆలయం, అయోధ్య రామపురంలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంతో పాటు తదితర ఆలయాల్లో ముందుగా విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి పుణ్యాహవచనం, రక్షాబంధనం, అఖండదీపారాధన, కలశస్థాపన, మండపారాధన, కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. ప్రసిద్ధ పంచారామ క్షేత్రం భీమేశ్వరస్వామి ఆలయంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి, వేద పండితులు ఆధ్వర్యంలో స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం సహస్ర బిల్వార్చన, అమ్మవారికి నవావరణార్చనలు వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.     

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us