డాక్టర్ మేడపాటికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు

UPDATED 26th NOVEMBER 2017 SUNDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ డైరెక్టర్, ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ వ్యక్తి జన్మదినోత్సవం రోజున మొక్కలు నాటి పలువురికి ఆదర్శంగా నిలవాలని, గురుతరమైన అధ్యాపక వృత్తిలో ఎందరో భావిభారత పౌరులకు ఆదర్శంగా నిలిచిన నాడు మనల్ని వారు అనుసరిస్తారన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్ వల్లెం శ్రీనివాసరావు, క్యాంపస్ ఇంచార్జ్ మేడపాటి భాస్కర చంద్రారెడ్డి, తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలియచేసారు.    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us