గంగవరం,1 జూన్ 2020 ( రెడ్ బీ న్యూస్): వై.ఎస్.ఆర్.సీ.పీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఏడాది కాలంలో పూర్తి చేయలేక పోయింది కానీ విజయోత్సవాలను జరుపుకోవడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు విమర్శించారు. గంగవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన సోమవారం మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు బహిరంగ సభలో చెప్పిన కబుర్లు మర్చిపోయారా ఆని గుర్తుచేశారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షను రూ.3 వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ అది ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. 45 సంవత్సరాలకే పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారా అన్నారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉండగా రాజధాని ప్రాంతం విజయవాడలోనే ఉంటే బాగుంటుందని అసెంబ్లీలో మద్దతు ప్రకటించారని అన్నారు. మీకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, చట్టాల మీద నమ్మకం ఉంటే న్యాయస్థానాలు జోక్యం ఎందుకు ఉంటుందని అని ఆయన ప్రశ్నించారు. మీకు మూడు వ్యవస్థల మీద నమ్మకం లేని పనులు చేస్తున్నారు. ప్రతిపక్షం కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే న్యాయస్థానాలు మీకు వ్యతిరేక తీర్పు ఇస్తున్నాయని అన్నారు. ఈ పరిస్థితిలో స్టేట్ ఎలక్షన్ కమీషనర్ ను స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉండగా మధ్యలో తొలగించడం ఆర్టికల్ 213 ప్రకారం వ్యతిరేకం అన్నారు. అది రాజ్యాంగంలో ఒక భాగం అని న్యాయస్థానం కూడా చెప్పడం జరిగిందని కానీ కొంతమంది వై.ఎస్.ఆర్.సీ.పీ ఎమ్మెల్యేలకు రాజ్యాంగం, న్యాయవ్యవస్థ మీద గౌరవం లేదని అందుకే న్యాయస్థానం జోక్యం చేసుకుంటుందని అన్నారు. ఏడాది కాలంలోనే ప్రజా వ్యతిరేక పాలన అందించిన ఘనత మీ పార్టీకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. ఐదు సంవత్సరాల్లో పాతిక లక్షలు ఇళ్లు కట్టి ఇస్తానని చెప్పడం జరిగిందని, కానీ ఏడాదిలో ఒక్క ఇల్లు కూడా కట్టలేకపోయారని ఇంకా ఇస్తామంటున్నారని దీన్ని ఎలా నమ్మమంటారని ప్రశ్నించారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తే తప్పకుండా మీకు న్యాయస్థానం, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువజన నాయకుడు సీతంశెట్టి రత్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







