అబ్దుల్ కలాంకు ఆదిత్య ఘననివాళి

UPDATED 27th JULY 2018 FRIDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య క్యాంపస్ లో గల ఆదిత్య గ్రూప్ ఆఫ్ పాలిటెక్నిక్ కళాశాలల ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం తృతీయ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్  నల్లమిల్లి శేషారెడ్డి కళాశాల ఆవరణలో గల కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడారు. అబ్దుల్ కలాం భారత జాతి ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నారని, అయన ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరూ   కృషి చేయాలన్నారు. కలాం ఆలోచనలు, ఆశయాలకు విద్యార్థులు ప్రతీకలుగా నిలవాలని, ఆయన నిరాడంబర జీవితం యావత్ మానవాళికి ఆదర్శప్రాయమని అన్నారు. లీడ్ ఇండియా ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ ఆర్. ఓమాజీ, లీడ్ ఇండియా ప్రేరణా శిక్షణ తరగతుల నిర్వాహకులు ఎ. అనీష్, వైస్ ప్రిన్సిపాల్ ఎ.వి. మాధవరావు, విభాగాధిపతులు పి. శ్రీనివాస్, విద్యార్థులు కలాం సేవలను కొనియాడారు. కలలు కనండి వాటి సాకారానికి కృషి చేయండి అన్న కలాం మాటలను మరువరాదని పలువురు వక్తలు విద్యార్థులకు పిలుపునిచ్చారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us