మీ ఇళ్ళకు మేము కాపలా

* మీ ఇంటికి మాదీ భద్రత
* లాక్డ్ హౌస్ మోనిటరింగ్ పై అవగాహన

UPDATED 28th JANAURY 2019 MONDAY 9:00 PM

సామర్లకోట: మీ ఇళ్ళకు మేము కాపలా ఉంటామని, మీ ఇంటికి మాదీ భద్రత అని భరోసా ఇస్తున్నారు  సామర్లకోట పోలీసులు. లాక్డ్ హౌస్ మోనిటరింగ్ విధానంపై స్థానిక వైఆర్ఎల్ డిగ్రీ కళాశాల ఆవరణలో సోమవారం విద్యార్థులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సామర్లకోట ఎస్ఐ ఎల్. శ్రీనివాసనాయక్ మాట్లాడుతూ లాక్డ్ హౌస్ మానిటరింగ్ విధానం ప్రకారం ఇంటి యజమాని పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ వంటి సమాచారంతో రిజిస్టర్ చేసుకోవాలని, రిజిస్టర్ చేసుకోగానే మీ ఫోన్ కి ఒక  యూనిక్ కోడ్ వస్తుందన్నారు. ఎప్పుడైనా ప్రజలు ఊరు వెళ్లాల్సి వస్తే యాప్ ఓపెన్ చేసి ఏ రోజు వెళ్తున్నారో, మళ్లీ తిరిగి ఏ రోజు వస్తారో అందులో రిక్వెస్ట్ వాచ్ పెట్టుకోవాలని అన్నారు. వారు అలా రిక్వెస్ట్ వాచ్ పెట్టగానే ఆ సమాచారం పోలీసు కంట్రోల్ రూమ్ కి చేరుతుందని, దీంతో పోలీసులు ఆ యజమాని ఇంటికి వెళ్లి వారి ఇంటికి మోషన్ కెమెరా మోడెంను అమర్చడం జరుగుతుందని, దీని సహాయంతో ఆ ఇంటి ముందు ఏవరైనా మనుషులు కదలాడితే ఆ సమాచారం వెంటనే పోలీసులకు, ఇంటి యజమానికి  తెలుస్తుందని పేర్కొన్నారు. అక్కడ జరిగేదంతా రికార్డు కూడా చేస్తుందని, దీంతో దొంగలను పట్టుకోవడం చాలా సులభమవుతుందని ఆయన తెలిపారు. ఈ విధానంతో గృహ యజమానులు తమ ఆస్తులకు పోలీసుల రక్షణ కల్పించుకోవచ్చని ఎస్ఐ తెలిపారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us