అంబేద్కర్ అందరివాడు

UPDATED 14th APRIL 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: అంబేద్కర్ దళితులకు మాత్రమే నాయకుడు కాదని అందరివాడని సిపిఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 127వ జయంతిని పురస్కరించుకుని స్థానిక సిపిఎం కార్యాలయంలో శనివారం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశంలో వెనుకబడిన ప్రజల కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారని, రాజ్యాంగం ద్వారా హక్కులు పొందిన ప్రతి ఒక్కరూ ఆయనను గౌరవించాలని అన్నారు. వెనుకబడిన వర్గాలకు చెందిన హక్కులను కొన్ని రాజకీయశక్తులు నాశనం చేస్తున్నాయని, మహిళల కోసం అనేక చట్టాలను తీసుకువచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కరణం ప్రసాద్, శ్రీనివాసు, సురేష్, మహేష్, పవన్, వరలక్ష్మి, కొండలరావు తదితరులు పాల్గొన్నారు

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us