UPDATED 23rd APRIL 2018 MONDAY 11:30 AM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 25వ తేదీ బుధవారం నాడు ప్రముఖ కంపెనీ ఇన్ఫోసిస్ ఆన్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి ఒక ప్రకటన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైనా డిగ్రీ ఉండి, ఎటువంటి బ్యాక్ లాగ్స్ లేకుండా ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ దీనికి అర్హులని, ఈ అవకాశాన్ని అర్హత గల విద్యార్థినీ, విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బయోడేటాతో పాటు ఏదైనా గుర్తింపు కార్డు (ఆధార్/ఓటర్) తీసుకొని రావాలని, ఎంపికైన అభ్యర్థులకు రూ.1.80 లక్షల వార్షిక ఆదాయం లభిస్తుందని అన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, ప్లేస్ మెంట్ విభాగ ప్రతినిధులు, పాల్గొన్నారు.







