ఎస్ఐ షరీఫ్ ఘన సత్కారం

గంగవరం (రెడ్ బీ న్యూస్) 28 డిసెంబర్ 2021: గంగవరం హనుమాన్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఎస్ఐ షరీఫ్ కు వీడ్కోలు సభ నిర్వహించి పూలమాలతో మంగళవారం సన్మానించారు. గంగవరం ఎస్ఐ ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ ఆటో యూనియన్ అధ్యక్షులు మడకం బాబురావు, అధ్యక్షులు మల్ల రాంబాబు, కార్యదర్శి బి.రాధాకృష్ణ ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

 

స్థానిక దైవ సన్నిధి రిలాక్స్ సెంటర్ లో అధ్యక్షుడు సంతోష్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఘన సన్మానం జరిగింది. ఎస్ఐగా ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా ఆయనను పూలమాలలతో, దుశ్శాలువాలతో గ్రామ ప్రజలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో దైవసన్నిధి ప్రతినిధులు ప్రభాకర్ మండల పాస్టర్స్ అసోసియేషన్ నాయకులు మడకం బాబురావు, ప్రసాద్, ప్రేమనందం, ఏఎస్ఐలు రజాక్, రమణ తదితరులు ఉన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us