UPDATED 13th OCTOBER 2017 FRIDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో వక్తిత్వ వికాసంపై శుక్రవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఐఐఎం కలకత్తా పట్టభద్రుడు కిరణ్ కురేవాడే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి ఆంగ్ల భాషపై పట్టు సాధించాలని, వృత్తి నైపుణ్యతా విలువలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి మాట్లాడుతూ కిరణ్ అనేక అవగాహనా సదస్సుల్లో పాల్గొని ఎందరో విద్యార్థులకు దిశానిర్దేశం చేశారని, విద్యా, పారిశ్రామిక రంగాల్లో ఆయనకు గల విశేష అనుభవంతో ఎందరో విద్యార్థులను ఉత్తేజపరిచి, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించి ఉన్నత ఉద్యోగాలు సాధించుటలో ఈయన కృషి అమోఘమని కొనియాడారు. అనంతరం ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి, అధ్యాపక సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.







