UPDATED 26th APRIL 2018 FRIDAY 9:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో గల పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన 47 మంది విద్యార్థులు బెంగూళూర్ కు చెందిన ప్రముఖ కంపెనీ నందీ నెట్ వర్క్ లో ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న నందీ నెట్ వర్క్స్ కంపెనీ ప్రతినిధులు నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో తమ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు సాధించారని, ఎంపికైన అభ్యర్థులు బెంగూళూర్ లో పనిచేయవలసి ఉంటుందని, వీరికి నెలకు రూ.15 వేలు వేతనం లభిస్తుందని తెలిపారు. ఉద్యోగాల కోసం తీవ్రపోటీ ఎదుర్కొంటున్న నేటి పోటీ ప్రపంచంలో పాలిటెక్నిక్ పట్టాతో పాటుగా మంచి జీతంతో కూడిన ఉద్యోగ నియామక పత్రంతో తమ కళాశాల విద్యార్థులు సగర్వముగా బయటకు అడుగుపెడుతున్నారని అన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపక సిబ్బంది, సుశిక్షుతులైన ప్లేస్ మెంట్ విభాగం ప్రత్యేక శిక్షణ ఇవ్వడం వల్ల విద్యార్థులు 2017-18 విద్యా సంవత్సరంలో 463 మంది విద్యార్థులు వివిధ కంపెనీలలో ఉద్యోగాలు పొందారని, విద్యార్థుల అభివృద్దే పరమావధిగా పనిచేసే అధ్యాపక సిబ్బంది కృషివల్ల ఈ ఘనత సాధించామని సతీష్ రెడ్డి అన్నారు. అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.టి.వి.ఎస్. కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ఎ. మాధవరావు, వివిధ విభాగాల అధిపతులు శుభాకాంక్షలు తెలిపారు..







