సామర్లకోట: 25 జూలై 2020(రెడ్ బీ న్యూస్):
కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్ణీత సమయం తరువాత కూడా వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్న వ్యాపారులపై శనివారం దాడులు నిర్వహించినట్టు పట్టణ ఎస్సై సుమంత్ తెలిపారు. ఈ దాడుల్లో దానిలో సుమారు 30 కిలోల చేపలు, రొయ్యలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టణంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు నిత్యావసర వస్తువులకు అమ్మకాలకు మాత్రమే అధికారులు అనుమతిని మంజూరు చేశారని, కానీ ఉదయం 11 గంటల తర్వాత కూడా స్థానిక అయిదు తూములు వద్ద చేపలు, రొయ్యలను విక్రయిస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతూ వ్యాపారాలు సాగిస్తున్నారన్న సమాచారం మేరకు ఆకస్మికంగా దాడులు నిర్వహించామని చెప్పారు.
అలాగే సామర్లకోట నుంచి కాకినాడ వెళ్ళే రోడ్డులో బిర్యానీ, కూరగాయలు పండ్లు ఇతర వస్తువులను విచ్చలవిడిగా విక్రయిస్తున్న వారిపై కూడా దాడులు నిర్వహించామని ఎస్సై పేర్కొన్నారు.మున్సిపల్ శానిటరీ ఇనస్పెక్టర్ రాజశేఖర్ పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







