UPDATED 22nd OCTOBER 2018 MONDAY 6:00 PM
రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్, సీమెన్స్ సంయుక్తంగా నిర్వహించిన మెకానికల్ సర్టిఫికేషన్ శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.వి. ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి ఇటువంటి శిక్షణలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. వారం రోజులపాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో 160 మంది విద్యార్థులు పాల్గొన్నారని, వీరికి ఎ.పి.ఎస్.ఎస్.డి.సి, సీమెన్స్ కు చెందిన ఆరుగురు ట్రైనీలు శిక్షణ ఇచ్చారన్నారు. భావి భారత ఇంజినీర్లు ఇటువంటి శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ప్రయోజనం పొందాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల మెకానికల్ విభాగాధిపతి కె. సుబ్బారావు, అసోసియేట్ ప్రొఫెసర్ ఎం. కేదారనాధ్, జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, తదితరులు పాల్గొన్నారు.







