ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో ప్లేస్ మెంట్ డే వేడుకలు

UPDATED 13th MARCH 2020 FRIDAY 9:00 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ప్లేస్ మెంట్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్తీక్ అభిరామకృష్ణ (టిసిఎస్ కాంపస్ హెడ్, ఎపి&టిఎస్ స్టేట్స్), దినేష్ సుభాష్ పురోహిత్ (టిసిఎస్ డిజిగ్నేట్ క్యాంపస్ హెడ్, ఎపి& టిఎస్ స్టేట్స్) ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు వివిధ మల్టీనేషనల్ కంపెనీలలో సాఫ్ట్ వేర్, కోర్ విభాగాలలో ఇంతటి ఘనత సాధించిన విద్యార్ధినీ, విద్యార్ధులు, కళాశాల ప్లేస్ మెంట్ విభాగం వారిని అభినందించారు. సీనియర్ విద్యార్థులు తమ జూనియర్ విద్యార్థులలో ప్రేరణ కలుగజేసి, రాబోయే రోజులలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేయాలని అన్నారు. 2001 నుంచి తమ కళాశాల ఉత్తమ విద్యా ప్రమాణాలు పాటించడం వల్ల ప్రముఖ సంస్థలైన టాటా కన్సల్టెన్సీ సర్వీస్, కాప్ జెమిని, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ టెక్నికల్ సొల్యూషన్స్ మొదలైన సంస్థలు నిరంతరం తమ విద్యార్థులను రిక్రూట్ చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2020 చివరి సంవత్సరం విద్యార్థుల్లో ఉద్యోగాలు సాధించిన 665కి పైగా విద్యార్ధినీ, విద్యార్ధులను, వారి తల్లిదండ్రులను ఆయన అభినందించారు. ముఖ్య అతిధులు కార్తీక్ అభిరామకృష్ణ, దినేష్ సుభాష్ పురోహిత్ లు తొలుత ఉద్యోగాలు సాధించిన విద్యార్ధినీ, విద్యార్థులు, వారి అభివృద్ధికి కృషి చేసిన కళాశాల మేనేజ్ మెంట్ ను అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్ధులు మరిన్ని ఎక్కువ అవకాశాలు అందుకుంటూ తమ భవిష్యత్తును మరింత ఉజ్వలంగా తీర్చుదిద్దుకోవాలని, అంతేకాక ప్రతీ విద్యార్ధి తమ ఉన్నతికి కారణమైన తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలని, సమాజంపట్ల బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. ప్రతీ ఒక్కరు ఆత్మవిశ్వాసంతో మెలిగి, ఏ పని చేసినా కష్టపడి కాకుండా ఇష్టపడి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ మేనేజ్ మెంట్ ఎం.వి. హరనాధబాబు, డైరక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభుప్రసాద్, ప్లేస్ మెంట్ ఆఫీసర్ ఎస్. వంశీకిరణ్, పి. నాగేంద్రరావు, మేనేజర్ కార్పోరేట్ రిలేషన్స్, విద్యార్ధినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us