టిసిఎల్ కంపెనీకి ఎంపికైన 98 మంది ఆదిత్య విద్యార్థులు

UPDATED 9th JANUARY 2020 THURSDAY 5:30 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య పోలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు టిసిఎల్ (చైనా) కంపెనీ గత మూడు రోజులుగా నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో 98మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధుల బృందంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వర్మ మాట్లాడుతూ సూళ్లూరుపేట శ్రీసిటీలో టిసిఎల్ కంపెనీలో ఉద్యోగాల నియామకం కోసం విద్యార్థులను ఎంపిక చేసేందుకు ఆదిత్యలో వ్రాత, మౌఖిక, గ్రూప్ డిస్కషన్, తదితర పరీక్షలతో పాటు ఇంటర్వ్యూలు నిర్వహించామని, అందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి ఉద్యోగ నియామక పత్రాలు అందచేసినట్లు తెలిపారు. ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు వార్షిక వేతనంగా రూ.1.82 లక్షలతో పాటు ఉచిత భోజన, వసతి, రవాణా సౌకర్యాలు కల్పించడం జరుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, పోలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.టి.వి.ఎస్. కుమార్, డీన్ ఎ.వి. మాధవరావు,  ప్లేస్ మెంట్ కోఆర్డినేటర్స్ అనిల్ పాలూరి, హరికృష్ణ, తదితరులు విద్యార్థులను అభినందించారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us