మహిళా సంఘాల బలోపేతానికి సాధికారమిత్రల సేవలు కీలకం

UPDATED 3rd AUGUST 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: మహిళా సంఘాల బలోపేతానికి సాధికారమిత్రల సేవలు ఎంతో కీలకమని మెప్మా హెడ్ ఆప్ మిషన్ డైరెక్టర్ పి. చినతాతయ్య అన్నారు. స్థానిక మెప్మాకార్యాలయంలో మెప్మా సిబ్బంది, రిసోర్స్ పర్సన్లు, సాధికార మిత్రలతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వ పథకాలు మహిళలందరికీ అందేలా చూడవలసిన బాధ్యత మెప్మా, సాధికార మిత్రలేనని అన్నారు. సాధికారమిత్రలకు ఆగస్టు పదిహేను నుంచి నెలకు రూ. ఐదు వేలు గౌరవవేతనం చెల్లించడం జరుగుతుందని, రూ. మూడు వేల రూపాయలు ప్రభుత్వ పరంగా వస్తాయని, మరో రూ. రెండు వేలు స్లమ్ లెవెల్ ఫెడరేషన్ చెల్లిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు, రీజినల్ కోఆర్డినేటర్ శివరాం, ఏవో ఎం. దైవ ప్రసాద్, టెక్నికల్ అధికారులు, మెప్మా సిబ్బంది,  కమ్యూనిటీ ఆర్గనైజర్ పి. వెంకటలక్ష్మి, కె. సుధారాణి, పి. శైలజ, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us