UPDATED 3rd DECEMBER 2019 TUESDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): 'దిశ' నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థి సంఘాలు నిరసన ర్యాలీ నిర్వహించారు. మంగళవారం స్థానిక జూనియర్ కళాశాల నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ స్టేషన్ సెంటర్, మెహర్ కాంప్లెక్స్ వరకు నిర్వహించి అనంతరం మానవహారం చేపట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నిస్సహాయ స్థితిలో సహాయం కోరిన యువతిని దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. మహిళలపై అత్యాచారం జరిగిన కేసుల్లో నిందితులను త్వరితగతిన శిక్షించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చట్టాలు రూపొందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ నాయకులు మద్దాల వెంకన్న, ముత్యం రాజబాబు, అందుగుల వీర్రాజు, ట్రాఫిక్ ఎస్ఐ బాలాజీ, నేతల హరిబాబు, కాళ్ళ లక్ష్మీనారాయణ, సింగంపల్లి శ్రీనివాస్, గోపి, శ్రీను, ఇరుసుమళ్ళ గోపాల్, తదితరులు పాల్గొన్నారు.







