UPDATED 29th AUGUST 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట (రెడ్ బీ న్యూస్): జాతీయ క్రీడల దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో ఫిట్ ఇండియా 5కె రన్ ర్యాలీ గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. సామర్లకోట మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు ఆధ్వర్యంలో స్థానిక స్టేషన్ సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు సాగింది. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. వ్యాయామం, క్రీడల ప్రాధాన్యతపై అవగాహన కల్పించే విధంగా ఫ్లెక్సీలు పట్టుకొని నిర్వహించిన ఈ ర్యాలీలో అడబాల కుమారస్వామి, కె. సోమేశ్వరరావు, అందుగుల జార్జ్ చక్రవర్తి, పోలిపల్లి బాబీవర్ధన్, ఇరుసుమళ్ళ రమణ, సేపేని సురేష్, కానూరి పవన్ కుమార్, తోటకూర సాయిరామకృష్ణ, తాళ్ళూరి వైకుంఠం, గిడుతూరి శ్రీనివాసరావు, కొండబాబు, రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.







