UPDATED 6th JANUARY 2020 MONDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక జగదీశ్వరాలయంలో వేంచేసియున్న అలివేలు మంగా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం సోమవారం వైభవంగా నిర్వహించారు. జగదీశ్వర భక్త సంఘం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్ధం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉదయం వేదస్వస్తి, సుమంగళులచే అభిషేక ద్రవ్యములతో ఊరేగింపు, విఘ్నేశ్వర పూజ, గోపూజ, మండపారాధన నిర్వహించారు. సాయంత్రం వివిధ రకాల సుగంధ పుష్పాలతో ప్రత్యేక పూజలు, లక్ష తులసి పూజ, నీరాజన మంత్ర పుష్పము, మహశీర్వచనము నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు హైదరాబాద్ వాస్తవ్యులు దర్భా భాస్కరరామశర్మ, దేవిసౌమ్య దంపతులచే స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం సుధా ఆగ్రో ఆయిల్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (సామర్లకోట) మేనేజింగ్ డైరెక్టర్ ఈడుపుగంటి రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమాలు మేడిచర్ల పాపవధానులు శిష్యులు వేమూరి సోమేశ్వరశర్మ, సన్నిధిరాజు సూర్య భాస్కరరావు, కుక్కుటేశ్వరరావు సోదరులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయానికి విద్యుత్ దీపాలంకరణ పిల్లాడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఉచితముగా ఏర్పాటు చేశారు.







