UPDATED 20th JULY 2019 SATURDAY 6:30 PM
గండేపల్లి: పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల కృషి అభినందనీయమని ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్, ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ 1,2 యూనిట్లు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా సుమారు 500 కిలోల పాత వార్తా పత్రికలు, నోటు పుస్తకాలు సేకరించే కార్యక్రమం చేపట్టారు. ఇలా సేకరించిన వాటిని ఐ.ఆర్.డి.ఏ సంస్థకి అప్పగించి తద్వారా వీటిని పునర్వినియోగం చేయడం ద్వారా కొత్త పేపర్ ఉత్పత్తి చేసి తద్వారా కొత్త నోట్ పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్దులుకు అందిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కళాశాల ప్రాంగణంలో స్టాల్ ఏర్పాటు చేసి గత వారం రోజులుగా వీటిని సేకరించినట్లు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్, ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానవర్జిన్, శివకుమార్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







