UPDATED 12th JUNE 2018 TUESDAY 9:00 PM
గండేపల్లి: మాతృభాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషలపై పట్టు విద్యార్థి అభివృద్ధికి తొలిమెట్టు అని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులతో కళాశాలలో మంగళవారం సమావేశం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం చైర్మన్ శేషారెడ్డి మాట్లాడుతూ విద్యార్ధి భవిష్యత్తుకు అధ్యాపకులు, తల్లితండ్రుల పాత్ర ఎంతో కీలకమని, ఆదిత్య విద్యా సంస్థలపై నమ్మకంతో తమ పిల్లలను తమ కళాశాలలో జాయిన్ చేసిన తల్లితండ్రుల నమ్మకాన్ని వమ్ము కానీయమని అన్నారు. మూడు దశాబ్దాలకు పైగా ఆదిత్య విద్యారంగంలో కెజి నుంచి పిజి వరకు రాష్ట్రంలోనే పేరెన్నికగన్న సంస్థగా నిలిచిందన్నారు. పాలిటెక్నిక్ రంగంలో నాణ్యమైన విద్యను అందిస్తున్న నమ్మకమైన సంస్థ ఆదిత్య అని, ఇందుకు నిదర్శనం గత సంవత్సరంలో సాధించిన ఫలితాలు గమనిస్తే అర్ధమౌతుందని అన్నారు. అనుభవజ్ఞులైన సిబ్బంది శిక్షణతో 526 మందికి పైగా విద్యార్థులు 2017-18 విద్యా సంవత్సరంలో ఉద్యోగాలు సాధించారని, ఈ-సెట్ 2018 ఫలితాలలో స్టేట్ 5వ ర్యాంకుతో పాటు 100లోపు 38 ర్యాoకులు తమ సంస్థ విద్యార్థులు కైవసం చేసుకొన్నారని తెలిపారు. అనంతరం హైదరాబాదుకు చెందిన మనోవికాస శాస్త్రజ్ఞులు సతీష్ మాకెన ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, ప్రిన్సిపాల్ ఎస్.టి.వి.ఎస్. కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ఎ. మాధవరావు, వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థి తల్లితండ్రులు, తదితరులు పాల్గొన్నారు.







