ఇంజనీరింగ్ రంగంలో నాణ్యమైన విద్యకు చిరునామాగా ఆదిత్య

UPDATED 15th JUNE 2018 FRIDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో గల ఆదిత్య కాలేజ్ ఆఫ్  ఇంజనీరింగ్, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలల 2018 -19 మొదటి సంవత్సరం తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కళాశాల క్యాంపస్ లో విద్యార్థి తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ ఈ నాలుగు సంవత్సరాల ఇంజనీరింగ్ విద్య ఎంతో కీలకమని, విద్యార్ధి ఉజ్వల భవిష్యత్తుకు ఆదిత్య అవలంబిస్తున్న విధానాలకు విద్యార్థి తల్లితండ్రులు సహకరించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని పిలుపునిచ్చారు.  వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ మూడు దశాబ్దాల పైబడి ఆదిత్య విద్యారంగంలో క్రమశిక్షణ, అత్యుత్తమ నాణ్యమైన విద్య అందించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఇంజనీరింగ్ రంగంలో నాణ్యమైన విద్యను అందిస్తున్న నమ్మకమైన సంస్థ ఆదిత్య అని, అందుకు ఆదిత్య గత సంవత్సరంలో సాధించిన ఫలితాలు గమనిస్తే అర్ధమౌతుందని, విద్యార్థి బంగారు భవిష్యత్తుకు యాజమాన్యంతో తల్లితండ్రులు సహకరిస్తే మంచి ఫలితాలు సాధిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎ. రామకృష్ణ, వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థి తల్లితండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us