ఆదిత్యలో ఘనంగా ఓనమ్ సంబరాలు

UPDATED 14th AUGUST 2018 TUESDAY 6:00 PM 

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం  ఆదిత్య సూరంపాలెం క్యాంపస్ లో విద్యను అభ్యసిస్తున్న మలయాళీ విద్యార్థినీ, విద్యార్థులు కేరళ రాష్ట్ర పండుగ ఓనమ్ సంబరాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం చైర్మన్ శేషారెడ్డి మాట్లాడుతూ వివిధ సంస్కృతులు, భాషలు, ప్రాంతాలకు చెందిన విద్యార్థుల సంప్రదాయాలకు అనుగుణంగా పండుగలు నిర్వహిస్తున్నామని, తల్లితండ్రులకు, తమ ప్రాంతాలకు దూరంగా ఉన్నామనే భావన విద్యార్థులకు కలగకుండా వారితో మమేకమై ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ వరదలతో తీవ్ర అవస్థలు పడుతున్న కేరళ ప్రజలకు తమ సంస్థ తరఫున సానుభూతి తెలుపుతున్నామని అన్నారు. తమ సంస్థలో వివిధ కోర్సులు అభ్యసిస్తున్న కేరళ విద్యార్థులు జరుపుకొంటున్న సంప్రదాయ పండుగ ఓనమ్ పండుగలో పాల్గోవడం ఆనందంగా ఉందని, విద్యార్థులంతా మంచి ఉన్నతస్థాయికి చేరుకొని తల్లితండ్రుల ఆశయాలను సాధించి గొప్ప వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం కేరళ సంస్కృతి ఉట్టిపడేలా నిర్వహించిన సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఎంతగానో అలరించాయి. అలాగే కేరళ సంప్రదాయ పద్దతిలో విద్యార్థినీ, విద్యార్ధుల వస్త్రధారణ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, డాక్టర్ కె. రవిశంకర్, ప్రొఫెసర్ వై. సురేంద్రనాథ్ రెడ్డి, ఇ. మోహన్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us