UPDATED 2nd JULY 2020 THURSDAY 9:00 PM
కాకినాడ(రెడ్ బీ న్యూస్): జిల్లాలోని పర్యావరణానికి దోహదపడే అన్ని చెరువులను సుందరంగా తీర్చిదిద్దే విధంగా తక్షణం చర్యలు చేపట్టాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇరిగేషన్, ఫారెస్ట్, పంచాయతీరాజ్, మున్సిపల్ కమీషనర్లతో జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ హరిత ట్రైబ్యునల్ చెరువుల నిర్వహణపై ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నందున వీటిని తీర్చిదిద్ది పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉన్న చెరువులను సుందరీకరణ చేయడంతో పాటు పాడైన చెరువులను వినియోగంలోకి తెచ్చేవిధంగా ప్రతీ గ్రామ పంచాయతీ, మున్సిపాల్టీల్లో ఒక చెరువు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులకు సంబంధించి వాటర్ బోడీలు ఉండాలని ఆయన పేర్కొన్నారు.







