UPDATED 23rd DECEMBER 2017 SATURDAY 9:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం 2017 కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. 2005 నుంచి 2017 సంవత్సరాల మధ్య ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన విద్యార్థులు కళాశాలలో తాము గడిపిన పూర్వ అనుభవాలను, మధురస్మృతులు పంచుకొన్నారు. ఈ సందర్భగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా తమ కళాశాల విద్యార్థులను తీర్చిదిద్దడంలో పూర్వ విద్యార్థులు దిక్సూచిగా వ్యవహరిస్తున్నారన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.శంభూప్రసాద్ మాట్లాడుతూ తమ కళాశాలలో అనుభూతి పొందిన ఆత్మీయ అనుభవాలను గుర్తుకుతెచ్చే వేదికగా ఈ కార్యక్రమం ఎంతో తోడ్పడుతుందని, ప్రస్తుత విద్యార్థుల భావి ప్రణాళికల నిర్దేశనలో పూర్వ విద్యార్థులు కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఎంతో ఉందని, దీనికి అనుగుణంగా ప్రగతి విద్యార్థులు పూర్వ విద్యార్థులు సంఘాన్ని(PECAA) నెలకొల్పాలని పేర్కొన్నారు. దేశ, విదేశాలలో వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరై తమ అధ్యాపకులు, సహచర విద్యార్థులతో మమేకం కావడానికి అవకాశం కల్పించిన కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రెసిడెంట్ ఎం.సతీష్, డైరెక్టర్ మేనేజ్మంట్ ఎం.వి. హరనాధబాబు, డైరెక్టర్ డాక్టర్ జి.రఘురాం, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సత్యనారాయణ, కంట్రోలర్ ఆఫ్ ఎక్సామినేషన్స్ ప్రొఫెసర్ వై. జయబాబు, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి.నరేష్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.







