UPDATED 16th MARCH 2022 WEDNESDAY 07:50 AM
పంజాబ్ సీఎంగా భగవంత్ సింగ్ మాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజధాని చండీగఢ్‌లో కాకుండా భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కాడ్ కలన్‌లో పదవీ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 2022, మార్చి 16వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని రాష్ట్ర ప్రజలందర్నీ ఆహ్వానిస్తూ ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. ఒక్క భగవంత్ సింగ్ మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం లేదు.. మొత్తం 3 కోట్ల పంజాబీ ప్రజలు ముఖ్యమంత్రులు కానున్నారని ఆయన అన్నారు. అందరం కలిసికట్టుగా షహీద్ భగత్ సింగ్ కలలుగన్న రంగ్లా పంజాబ్‌ను సాకారం చేద్దామని పిలుపునిచ్చారు. మగవారంతా పసుపచ్చ తలపాగాలు ధరించాలని, మహిళలు అదే రంగు దుప్పట్టా వేసుకొని రావాలని కోరారు. పంజాబ్‌లో విజయోత్సాహంతో ఆప్ పార్టీని ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా బెంగాల్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో పాల్గొని, గ్రామ స్థాయిలో ఉనికి చాటుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 2014 నుంచే ఈ పార్టీ ఉన్నా ఇంతవరకు చెప్పుకోదగ్గ ప్రభావం చూపించలేదు.ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా… పంజాబ్ రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆఫ్ విజయదుందుభి మ్రోగించింది. 117 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఆప్ ఏకంగా 92 సీట్లలో విజయం సాధించింది. చీపురు దెబ్బకు కాంగ్రెస్, బీజేపీతో సహా ఇతర పార్టీలు కొట్టుకపోయాయి. ఈ క్రమంలో పంజాబ్ రాష్ట్ర సీఎంగా ఉన్న చరణ్ జీత్ సింగ్ చన్నీ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు సమర్పించారు. హాస్యనటుడు నుంచి ముఖ్యమంత్రి వరకు కొనసాగిన ఆయన ప్రస్థానంలో ఎన్నో పరాజయాలు.. మరెన్నో విజయాలు ఉన్నాయి. అయితే ఓటములకు కుంగిపోని ఆయన.. గెలుపుతోనే విమర్శకులకు సమాధానం చెప్పారు. గవంత్ మాన్ 1972 అక్టోబర్ 17న పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లా సతోజ్ గ్రామంలో జన్మించారు. అతని తండ్రి పేరు మోహిందర్ సింగ్, ఆయన ఉపాధ్యాయుడు. పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలోని SUS ప్రభుత్వ కళాశాలలో బీకామ్ చదివిన మాన్ ఇంద్రప్రీత్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు.







