UPDATED 9th OCTOBER 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: పట్టణంలో బస్సు కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో పలువురు మహిళలు చిన్నారులతో వీధి భిక్షాటన చేయిస్తున్నారని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో స్థానిక ఐసిడిఎస్ సిబ్బంది, బాలల సంరక్షణ అధికారులు ఆధ్వర్యంలో మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పది మంది పిల్లలను అదుపులోకి తీసుకుని ఐసిడిఎస్ అర్బన్ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. బాలలతో భిక్షాటన చేయించడం నేరమని, చిన్నారులను సమీపంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చాలని, ఇకపై బాలలతో భిక్షాటన చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మహిళలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిపిడివో పద్మావతి, సుందరం, మంగ, ఎం. సత్యనళిని, కృష్ణకుమారి, వెంకట్, రాజ్ కుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.







