UPDATED 24th NOVEMBER 2018 SATURDAY 6:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో మత సామరస్య దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ దేశాభివృద్ధిలో యువత ఎంతో పాటుపడుతున్నారని అటువంటి యువతలో మత సామరస్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభుప్రసాద్ మాట్లాడుతూ జాతీయ ఐక్యత అనేది అన్ని రంగాలలో జాతీయ అభివృద్ధికి తనదైన ముద్ర వేసుకుందని, ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్ఎస్ఎస్ విభాగాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమాన్ని ప్రార్ధన గీతాలాపనతో ప్రారంభించిన అనంతరం దేశ ఐక్యతకు సంబంధించిన వివిధ పోస్టర్ ప్రెజెంటేషన్లు, డాన్స్, పాటలు, డ్రామాలను ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రదర్శించారు. అనంతరం విజేతలకు సర్టిఫికెట్లు అందచేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ మేనేజ్ మెంట్ ఎమ్.వి. హరనాధబాబు, డైరెక్టర్ అఫ్ అకడమిక్స్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీస్ అడ్మిన్ డాక్టర్ జి.నరేష్, డీన్ అర్&డి డాక్టర్ పి.వి.యస్. మాచిరాజు, డాక్టర్ పి. కుమార్ బాబు, రాజశేఖర్ ఫణీంద్ర, బి. సుధీర, రవిచౌదరి, తదితరులు పాల్గొన్నారు.







