జాతీయస్థాయి వక్తృత్వ పోటీలలో ఆదిత్య విద్యార్థుల సత్తా

UPDATED 31st JULY 2018 TUESDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ విద్యార్థులు కాకినాడ పరిధిలో కైట్, ప్రగతి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన మాస్టర్ ఒరాటర్ ఛాంపియన్ షిప్ జాతీయస్థాయి వక్తృత్వ పోటీలలో తమ కళాశాల విద్యార్థులు సత్తా చాటి హైదరాబాదులో నిర్వహించే ఫైనల్ కు ఎంపిక అయినట్లు ఆదిత్య బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ జాతీయస్థాయి వక్తృత్వ పోటీలలో తమ విధ్యార్ధులు సత్తాచాటి డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంబిఏ చదువుచున్న 58 మంది విద్యార్థులు హైదరాబాద్ నగరంలో నిర్వహించే తుది పోటీలకు అర్హత సాధించారని తెలిపారు. సమాచార నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను పరిగణన లోకి తీసుకొని విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఎంపిక చేశారని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్ధాశర్మ మాట్లాడుతూ విద్యతోపాటు సమాచార నైపుణ్యాలతో చక్కటి శిక్షణను ఇప్పించడం ద్వారా తమ విద్యార్థులు ప్రతిభ చాటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు విజేతలను అభినందించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us