UPDATED 20th MARCH 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: జిల్లాలోని పురపాలక సంఘాలలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల ప్రగతిని పరిశీలించేందుకు ఢిల్లీ నుంచి ఇద్దరు సభ్యుల కేంద్ర బృందం మంగళవారం వచ్చారు. హోం డిపార్ట్ మెంట్ కు చెందిన ఓఎస్డిలు మహమ్మద్ అసిఫ్, సంజీవ్ కుమార్ శర్మ పురపాలక సంఘం పరిధిలోని శానిటేషన్, వాటర్ సప్లై, పాఠశాలలు, రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ హాళ్లను స్వయముగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ కు చెందిన లైజన్ అధికారి ముజిబర్ రెహమాన్, మునిసిపల్ కమిషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, ప్రభాకర్, హెచ్ఎం తోటకూర సాయి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.







