'జనసేన'తోనే సుపరిపాలన

* రాజకీయ వ్యవస్థలో మార్పే జనసేన లక్ష్యం
* ప్రతి కార్యకర్త వెయ్యి మందిని ప్రభావితం చేసేలా తయారుకావాలి
* పెద్దాపురం నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థి తుమ్మల రామస్వామి

UPDATED 4th APRIL 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట: జనసేన పార్టీతోనే సుపరిపాలన సాధ్యమని ఆ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థి తుమ్మల రామస్వామి(బాబు) తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం సామర్లకోట పట్టణంలో పలు వార్డుల్లో ఆయన పర్యటించి విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పార్టీ విధానాలు, మేనిఫెస్టోకు సంబంధించిన అంశాలతో కూడిన కరపత్రాలను అందరికీ అందజేశారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి మాట్లాడుతూ రాజకీయ వ్యవస్థలో మార్పే జనసేన లక్ష్యమని, అందు కోసమే పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ స్థాపించారని అన్నారు. రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన కోసం పవన్‌ కల్యాణ్‌ అహర్నిశలు కష్టపడుతున్నారని చెప్పారు. ప్రతి జనసేన కార్యకర్తా వెయ్యి మంది ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులుగా తయారు కావాలని పిలుపునిచ్చారు. మోసపూరిత రాజకీయాలు, హామీలతో ప్రజలను మభ్యపెడుతున్న పార్టీలకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పేర్కొన్నారు. ఈ ప్రచారంలో స్థానిక స్టేషన్ సెంటర్ వద్ద ఉన్న రైల్వే ఆటో యూనియన్ సభ్యులు పెద్ద ఎత్తున జనసేన పార్టీలోకి చేరారు. వారికి తుమ్మల రామస్వామి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అలాగే పట్టణ పరిధిలో గల  అమ్మణమ్మ అపార్ట్ మెంట్స్ వద్ద తుమ్మల రామస్వామి సతీమణి తుమ్మల శ్రీదేవి ఇంటింటికి తిరిగి పవన్ కల్యాన్ ప్రవేశపెట్టిన పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ తమ పార్టీ గుర్తు గాజుగ్లాసుపై ఓట్లు వేసి తుమ్మల రామస్వామిని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆకుల పెదబాబు, మంచాల దొర, మార్తాండ ఠాగూర్, బాబ్జి, నానాజీ, సరోజ్ వాసు, ఎస్. ఉదయకుమార్, తుమ్మల ప్రసాద్, మహ్మద్ షఫీయుల్లా, పెంకే వెంకటలక్ష్మి, కృష్ణవేణి, పిట్టా జానకిరామారావు, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 
 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us