ఆదిత్యలో ఘనంగా ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

UPDATED 24th SEPTEMBER 2018 MONDAY 8:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలల ఎన్ఎస్ఎస్ యూనిట్ల సంయుక్త ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి (ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల), డాక్టర్ టి.కె. రామకృష్ణారావు (ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ), డాక్టర్ రమేష్ ఆదిరెడ్డి (ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల) మహాత్మాగాంధీ, మదర్ థెరిసా చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. 2016-18 సంవత్సరాలకు గాను ఉత్తమ సేవలు అందించిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు ప్రశంసా పత్రాలు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ సేవానిరతి పెంచుకోవాలని తదనుగుణంగా ఉన్నత వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని పిలుపు నిచ్చారు. ఎన్ఎస్ఎస్. కార్యక్రమాలలో సభ్యులుగా చేరడం వల్ల నాయకత్వ లక్షణాలు, సేవాభావం పెంపొందించుకోవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ విభాగం ద్వారా నిర్వహించిన సేవా కార్యక్రమాలుపై వీడియో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ప్రోగ్రాం ఆఫీసర్లు పి. శివకుమార్, ఆర్. జ్ఞానవర్జిన్, సి.హెచ్. భాస్కర్, జె. బాలమోహన్ రాజు, ఎం. సోమిరెడ్డి , వివిధ విభాగాధిపతులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us