UPDATED 6th DECEMBER 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని అధిక సంఖ్యలో గురువారం భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్దఎత్తున బారులు తీరారు. మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నంది మండపం వద్ద వేదపండితుల ఆశీర్వచనాలు అందుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, సభ్యులు పడాల వీరబాబు, బాడితమాని త్రిమూర్తులు, దేవస్థానం ఈవో పులి నారాయణమూర్తి, పాగా సురేష్ కుమార్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







