* పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర
* నియోజకవర్గంలో లభిస్తున్న అనూహ్య స్పందన
UPDATED 29th MARCH 2019 FRIDAY 9:00 PM
సామర్లకోట: పేద ప్రజల సంక్షేమమే జై భారత్ నేషనల్ పార్టీ లక్ష్యమని పార్టీ జాతీయ అధ్యక్షుడు, పెద్దాపురం నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థి డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పట్టణ పరిధిలోని స్థానిక సత్యనారాయణపురంలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నయ్యదొర మాట్లాడుతూ జై భారత్ నేషనల్ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా చేయటానికి తమ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. తాను స్థానికుడినని, స్థానికతే తన బలమని నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని తాను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. అలాగే సామర్లకోట పట్టణంలో రెండవ ఓవర్ బ్రిడ్జి నిర్మించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని, అవినీతి రహిత పాలన తమ పార్టీతోనే సాధ్యమని, అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం తమ పార్టీకి ప్రజలంతా మద్దత్తునివ్వాలని ఆయన కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి తమ పార్టీ గుర్తు గాజులుపై ఓటువేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాటంరెడ్డి దొరబాబు, ప్రసన్న, సత్యశ్రీ, అబ్బాస్, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.







