UPDATED 3rd MAY 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట : స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో నిర్వహించిన ఎంపిపి ఎన్నిక సమావేశానికి రెండవ రోజు కూడా ఎంపిటిసి సభ్యులు ఎవరూ హాజరుకాకపోవడంతో సమావేశం వాయిదా వేసినట్లు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, పంచాయితీరాజ్ డిఇ వై.ఎస్. హరినాధరావు తెలిపారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ కు నివేదిక పంపనున్నట్లు ఆయన తెలిపారు.







