UPDATED 31st JULY 2019 WEDNESDAY 5:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ 1,2 యూనిట్లు ఆధ్వర్యంలో జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని దత్తత గ్రామాలైన కొండపల్లి, పి. నాయకంపల్లి గ్రామాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా వాలంటీర్లు ప్లకార్డులు పట్టుకుని వీధులలో ఊరేగుతూ గ్రామస్తులకు నీటి అవశ్యత, వర్షపునీరు ఒడిసిపెట్టే విధానం, ఇంకుడు గుంతలు ప్రాముఖ్యత గురించి ప్రజలకు వివరించారు. అలాగే ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పదవ తరగతి విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా నీటి నిల్వ వల్ల కలిగే లాభాలను వివరించారు. ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు శివకుమార్, జ్ఞానవర్జిన్, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







