ఆదిత్యలో ప్రాజెక్ట్ ఎక్స్ పో-2020

UPDATED 18th MARCH 2020 WEDNESDAY 7:00 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఐ.ఎస్.టి.ఇ స్టూడెంట్స్ ఛాప్టర్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ ఎక్స్ పో -2020 పేరిట విద్యార్థులు  రూపొందించిన వివిధ రకాల ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని క్యాంపస్ డైరెక్టర్, ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్  ఆదిరెడ్డి రమేష్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతీ విభాగం నుంచి ఇలాంటి  కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి చేయాలని అన్నారు. విద్యార్థులు తమ నూతన ఆవిష్కరణలతో 50కి పైగా ప్రాజక్టులు రూపొందించడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహక సిబ్బందికి వారు అభినందించారు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్లుగా డాక్టర్ సి.హెచ్.వి. రాఘవేంద్రన్, ఆర్. భీమారావు, విభాగాధిపతులు ప్రొఫెసర్ ఎం. అనిల్ కుమార్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ ఎ. రామకృష్ణ, అధ్యాపక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us