పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 23 అక్టోబర్ 2021: పెద్దాపురం రెవిన్యూ డివిజనల్ అధికారి పి. వెంకటరమణ ఆర్డీవో కార్యాలయం నుంచి డివిజన్ పరిధిలోని తహశీల్దార్లతో వర్చువల్ కాన్ఫరెన్స్ సమావేశం శనివారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలపై రెవెన్యూ పరమైన అంశాలపై ఆర్డీవో దిశా నిర్దేశం చేశారు. డివిజన్లోని వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ ఆరోగ్య కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, డిజిటల్ లైబ్రరీ తదితర శాశ్వత భవన నిర్మాణాలకు అవసరమైన భూమిని గుర్తించి నివేదికను పంపించాలని ఆదేశించారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని తొలగించడానికి చర్యలు తీసుకోవాలని, మండలాల వారీగా ఉన్న కోర్టు కేసులకు కౌంటర్ ఫైల్ చేయించాలని, మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను సకాలంలో పూర్తి పూర్తి చేయించాలని, పట్టాదార్ పాస్ పుస్తకాల గురించి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి పాస్ పుస్తకాలు అందించాలని, ప్రతి సోమవారం నిర్వహించే స్పందన లో వచ్చే అర్జీలను పరిష్కరించాలని, మండలంలో మున్సిపాలిటీలకు సంబంధించి హౌస్ సైట్ కు భూ విస్తీర్ణాన్ని గుర్తించి నివేదిక పంపించాలని, త్వరలో చేపట్టనున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలు ద్వారా అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఈకేవైసీ నూరు శాతం పూర్తి చేయించాలని, గన్ని బ్యాగ్స్ సిద్ధం చేయించాలని, బియ్యం కార్డులు గురించి తదితర అంశాలకు స్పందించిన నివేదికలను ఆర్డీవో కార్యాలయానికి పది రోజులు కాల వ్యవధిలో పంపించాలని ఆర్డివో ఆదేశించారు. ఈ సమావేశంలో కార్యాలయం డీటీ రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







