* పెద్దాపురం ఎస్ఐ బాలాజీ
UPDATED 20th JULY 2020 MONDAY 6:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని పెద్దాపురం ఎస్ఐ ఏ. బాలాజీ పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై ప్రజలకు మరింతగా అవగాహన పెంచేందుకు పట్టణ పరిధిలోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ జంక్షన్, కొత్తపేట పెట్రోల్ బంక్ సెంటర్ల వద్ద కోవిడ్ అప్రమత్తతను సూచించే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ కరోనా భాదితుల పట్ల ప్రతీ ఒక్కరూ భాద్యతగా మెలగాలని, వివక్ష చూపించరాదని అన్నారు. స్వీయ జాగ్రత్తలు పాటించకపోతే వైరస్ మరింత వ్యాప్తిచెందే ప్రమాదముందని హెచ్చరించారు. శానిటైజర్ వాడుతూ, మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు.







