శ్రమిస్తే తప్ప విజయాలు పొందడం సాధ్యంకాదు

UPDATED 10th NOVEMBER 2019 SUNDAY 8:30 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): క్రీడల్లో అధికంగా శ్రమిస్తే తప్ప విజయాలు పొందడం సాధ్యం కాదని విక్టరీ ఫొటో ఖాన్ కరాటే అసోసియేషన్ ఇండియా చీఫ్, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. మల్లికార్జునగౌడ్ అన్నారు. స్థానిక గాంధీబొమ్మ సెంటర్లోని యార్లగడ్డ సుబ్బారావు రైతు భవనంలో సౌత్ జోన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. లయన్స్ అధ్యక్షులు మేకా శ్రీనివాస్ అధ్యక్షతన కరాటే కోచ్ డి. శంకరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇండియా చీఫ్ మల్లిఖార్జునగౌడ్, లయన్స్ డిస్టిక్ గవర్నర్ ఎస్.వి.వి. సత్యన్నారాయణ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ క్రీడలో అయినా శ్రమిస్తేనే తప్ప విజయాలు పొందడం సాధ్యం కాదని, ముఖ్యంగా బాలికలు కరాటే వంటి క్రీడల్లో పాల్గొని వ్యక్తిగత ఆత్మరక్షణకు పెంపొందించుకోవాలని అన్నారు. ప్రస్తుతం కరాటే క్రీడను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, ఒలింపిక్స్‌లోను చేర్చడం వల్ల రానున్న రోజుల్లో ఎంతో ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. విద్యార్థులు ఈ క్రీడలో మెళుకువలను తెలుసుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి గుర్తింపు తీసుకురావాలని అన్నారు. ఈ టోర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు పాండిచ్చేరి, కర్నాటక రాష్ట్రాల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొని తమ  ప్రతిభను కనపరిచారు. ఈ కార్యక్రమంలో ఐదు రాష్ట్రాలకు చెందిన 20 మంది సీనియర్ కోచ్ లు, ముఖ్య అతిథులను లయన్స్ క్లబ్ నాయకులు, కరాటే కోచ్ దుశ్శాలువా, పూలమాలలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పోటీల్లో పాల్గొన్న విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు, ఓవరాల్ ఛాంపియన్ షిప్ ప్రథమ, ద్వితీయ, తృతీయ ట్రోఫీలను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డి.ఎల్. నారాయణ, ఎం. విశ్వేశ్వరరావు, ఇంద్రగంటి శ్యామ్, రవికుమార్, మద్దిరాల శివనాగకృష్ణ, కర్రి ఆదినారాయణ రెడ్డి, ఆకుల సూర్యనారాయణ, పెదబాబు, టి. సత్యన్నారాయణ, కటకం గంగబాబు, సుబ్రహ్మణ్యం, సేపేని సురేష్, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us