UPDATED 27th SEPTEMBER 2017 WEDNESDAY 10:30 PM
కాకినాడ : కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా కాకినాడ ఎంపీ తోట నరసింహం నియమితులయ్యారు. ఈ మేరకు ఢిల్లీలోని స్పీకర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందినట్లు కాకినాడలోని ఎంపీ క్యాంపు కార్యాలయవర్గం తెలిపింది. ఇప్పటికే ఆయన కేంద్ర రైల్వే పెట్రోలియం శాఖల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, జాతీయ కొబ్బరి బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.







