East Godavari: తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో అర్థరాత్రి వేళ అశ్లీల నృత్యాలు

కొత్తపేట (రెడ్ బీ న్యూస్) 16 జనవరి 2022: తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో అర్థరాత్రి వేళ అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు నిర్వాహకులు. పోలీసు ఆంక్షల్ని సైతం తుంగలో తొక్కి.. స్వేచ్చగా.. అశ్లీల నృత్యాలను ప్రదర్శించడంపై మండిపడుతున్నారు .. స్థానికులు. ఓ వైపు అసాంఘిక కార్యకలాపాలు జరిగితే ఉక్కుపాదం మోపుతామంటున్న పోలీసులు.. కొత్త పేటలో అశ్లీల నృత్యాల గురించి సమాచారం ఉన్నా పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం ఈ ప్రాంతం వైపు కన్నెత్తి చూడలేదంటుూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us